ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో శనివారం రీజనల్ ఇన్ఛార్జి మేనేజర్ సేలం రామారావు సందర్శించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1168 బేళ్లలో 833 బేళ్లు మాత్రమే కొనుగోలు చేయగా, 335 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయి. ప్రారంభం నుంచి తిరస్కరణ సంఖ్య అధికంగానే ఉందని రైతులు వాపోయారు.