కొండపి వైసిపి ఇన్ ఛార్జ్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలు నష్టపోతారని అన్నారు. శుక్రవారం సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి, వారి అభిప్రాయాలను సంతకాల ద్వారా సేకరించారు. గవర్నర్ ను కలిసి మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి అడ్డుకుంటామని మాజీ మంత్రి పేర్కొన్నారు.