ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంత లక్ష్మి స్వయంగా లబ్ధిదారులకు వెళ్లి దాదాపు రూ. 6 లక్షలకు పైగా విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 14 మందికి ఈ ఆర్థిక సహాయం అందింది. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే నారాయణరెడ్డి సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఈ సహాయం ఇప్పిస్తున్నట్లు వసంత లక్ష్మి తెలిపారు.