ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాలలో శనివారం తుఫాను ప్రభావిత ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి కలెక్టర్ రాజబాబు పరిశీలించారు. తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అధికారులతో కలిసి అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నివేదికను ప్రభుత్వానికి పంపించి, నష్టపోయిన బాధితులకు పరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు.