రికవరీ ఏజెంట్లకు కౌన్సిలింగ్

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మంగళవారం, రికవరీ ఏజెంట్లతో డీఎస్పీ నాగరాజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వేలిముద్రల ద్వారా నగదు బదిలీ చేసే ఏజెంట్లకు, ఆధార్ కార్డు ద్వారా నగదు బదిలీ చేసేవారికి ఆయన సూచనలు ఇచ్చారు. రికవరీ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఎటువంటి అవకతవకలకు పాల్పడినా ఉపేక్షించబోమని డీఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్