కొత్తపట్నం: సముద్ర తీరానికి పోటెత్తిన భక్తులు

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని కే. పల్లెపాలెం సముద్ర తీరానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే సముద్ర స్నానాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు, కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే, అల్పపీడనం కారణంగా భక్తులను సముద్రంలోకి అనుమతించలేదు. పోలీసులు తీరాన్ని పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్