పొదిలిలో పాము కలకలం

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో సోమవారం రాత్రి ఒక ఇంట్లోకి పాము ప్రవేశించి కలకలం సృష్టించింది. ఇంటి యజమాని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం, పామును సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా పాములు ఇళ్లలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్