కటకాని పల్లె గ్రామానికి చెందిన రైతు దూదేకుల రసూలక్కు కలెక్టర్ రాజబాబు ధైర్యం నింపారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు గ్రామానికి వచ్చిన కలెక్టర్ రాజబాబును రసూల్ కలిసి వెలిగొండ కాలువకు గండి పడి దెబ్బతిన్న తన పొలాన్ని పరిశీలించి రాళ్లను తొలగించాలని కలెక్టర్ను వేడుకున్నారు. స్పందించిన కలెక్టర్ పొలాన్ని బాగు చేసే బాధ్యత తమది అని హామీ ఇచ్చారు.