ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంతా తుఫాను బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం నుంచి స్థానిక అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించారు. తుఫాను కారణంగా వ్యాధులు, విష జ్వరాలు సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో పట్టణ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయడంతో పాటు చెత్త చెదారాలను పారిశుద్ధ్య కార్మికుల ద్వారా తొలగిస్తున్నారు. బ్లీచింగ్ చల్లి శుభ్రం చేయిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.