ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరానికి బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు అనుమతినిచ్చినట్లు కొత్తపట్నం ఎస్సై వేముల సుధాకర్ తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తీరం వద్ద పుణ్యస్నాలను భక్తులు ఆచరిస్తారు. ఈ సందర్భంగా తీరం వద్దకు వచ్చిన భక్తులు, పోలీసుల సూచనలు పాటించాలని ఎస్సై కోరారు. నిర్దేశించిన ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించాలని సూచించారు.