అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చి... ప్రమాదంలో తనువు చాలించి..!

ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం వైద్యసేవల నిమిత్తం వచ్చిన రోగి జారిపడి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం గోళ్లవిడిపికి చెందిన ముండ్ల నిరీక్షణబాబు (55) కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆయన భార్య రత్నకుమారి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యుల సూచన మేరకు రక్తపరీక్షలకు తీసుకెళుతుండగా నిరీక్షణబాబు కాలుజారి వెనక్కు పడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందారు. రత్నకుమారి ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ సీఐ వై. నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్