ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం సముద్రతీరాన్ని బుధవారం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రతీరానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆపదలు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు సిబ్బందికి ఆయన సూచనలు చేశారు. మెరైన్ పోలీసులతో పాటు ఇతర పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి, గజ ఈతగాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.