ప్రకాశం జిల్లాలో నవంబర్ 1 నుండి 30 వరకు యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఓంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.