కార్తీక సోమవారం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత

ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలోని సముద్రతీరంలో కార్తిక సోమవారం సందర్భంగా భక్తుల భద్రతకు పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, భక్తులు సముద్ర స్నానం ఆచరించేందుకు వస్తున్నప్పుడు ఎలాంటి అపాయం జరగకుండా ఈతగాలను పోలీసులు మోహరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ భద్రతా ఏర్పాట్లు కొనసాగాయి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్