ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మాచవరం సమీపంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్ అండ్ బి రహదారి నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఒంగోలు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గోపి నాయక్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ జానీవలి, జె. ఈ దాసరి మాధవరావు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రానికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఈ పనుల వల్ల స్థానిక ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తొలగిపోనున్నాయి.