ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి మాదిగపల్లె గ్రామంలో సోమవారం దళితులకు చెందిన పంటను శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ధ్వంసం చేశాడని దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రెండో వర్గం పోలీసుల సమక్షంలోనే మరో వర్గంపై దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.