గ్రామంలో ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో సోమవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని పలువురికి గాయాలయ్యాయి. మరొకరి పొలంలోకి గొర్రెలు మేతకు వెళ్లడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. అధికారులు గ్రామంలో హై అలర్ట్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్