త్రిపురాంతకం మండలం మేడపి భవిష్ నివాసంలో అరుదైన నీటి జాతి పాము కనిపించింది. స్థానికులు స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. అతను చాకచక్యంగా పామును బంధించారు. ఇది అరుదుగా కనిపించే విష రహిత పాము అని స్నేక్ క్యాచర్ చెప్పారు. తర్వాత దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.