బొమ్మలాపురం: మిద్దె పెచ్చులు ఊడి.. మహిళ తలకు గాయాలు

దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం బ్రహ్మంగారి గుడి సమీపంలోని చెంచు కాలనీలో మిద్దె పెచ్చులు ఊడి దాసరి ముగేమ్మ అనే మహిళ తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ మహిళకు చికిత్స అందిస్తున్నారు. ఇల్లు లేక అవస్థ పడుతున్నామని, అధికారులు, పాలకులు స్పందించి తమకు పక్కా గృహాలు మంజూరు చేయాలని చెంచులు కోరుతున్నారు. గడచిన 30 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, తమను ఎవరూ పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్