రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

మొంథా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ రాజాబాబు భరోసా ఇచ్చారు. శనివారం ఆయన టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి దోర్నాల మండలంలో పర్యటించి, గంటవానిపల్లిలో దెబ్బతిన్న రోడ్లను, కటకానిపల్లిలో పంటలను పరిశీలించారు. పంట నష్టంపై పూర్తి స్థాయిలో అంచనా వేసి, రైతులకు సహాయం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్