పుచ్చకాయలపల్లెను ముంచెత్తిన వరద

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శుక్రవారం పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామం వరద నీటిలో మునిగిపోయింది. డ్రైనేజీ కాలువలు, పొలం కాలువలు పూడిపోవడమే దీనికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్