మంగళవారం పశ్చిమ ప్రకాశం జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. త్రిపురాంతకం మండల కేంద్రంలో గంటల తరబడి వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. పంట పొలాల్లోకి నీరు చేరడంతో ఇప్పటికే దెబ్బతిన్న పంటలకు మరోసారి వర్షాలు నష్టం కలిగించవచ్చనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.