శనివారం రాత్రి పది గంటల సమయంలో వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు, రాళ్లపల్లి గ్రామాల మధ్య బైకుపై వెళ్తున్న గోన వెంకటయ్య పులిని పొలాల్లోకి వెళ్లడాన్ని చూసినట్లు తెలిపారు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు సూచించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.