త్రిపురాంతకంలో బెంబేలెత్తిన పాము

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడేపి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ ఇంటిలో కనిపించిన పాము ప్రజలను బెంబేలెత్తించింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పామును సురక్షితంగా బంధించి స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. స్నేక్ క్యాచర్ మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడ్డ పాము విషపూరితమైనది కాదని, నీటి జాతులకు చెందినదని పేర్కొన్నారు. ప్రజలు పాములు కనిపిస్తే వాటిని చంపకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్