AP: కూటమి ప్రభుత్వం త్వరలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 13,500 మంది మహిళా పోలీసులకు ప్రమోషన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే వారికి నచ్చిన శాఖను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం వారి నుంచి అభిప్రాయాలను కూడా సేకరిస్తోందట. గత వైసీపీ ప్రభుత్వం వీరిని ప్రత్యేకంగా నియమించిన సంగతి తెలిసిందే.