AP: విశాఖపట్నంలోని దువ్వాడలో ఉన్న లావిసి బ్యూటీ సెలూన్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో పాటు ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్ఐ భరత్ కుమార్ రాజు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.