AP: తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సులోకి సైబీరియన్ పక్షుల రాక మొదలైంది. దీంతో మూడు రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అక్టోబరులో వచ్చి మార్చిలో వెళ్లిపోయే ఈ విదేశీ అతిథులు ఏడాది పొడవునా కనువిందు చేస్తున్నారని, పులికాట్ ను ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.