ర్యాగింగ్.. ఐరన్ బాక్స్‌తో వాతలు పెట్టారు

AP: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపింది. మోరంపూడిలోని శ్రీ చైతన్య హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన విద్యార్థి ప్రసాద్‌పై సహచర విద్యార్థులు ఐరన్ బాక్స్‌తో వాతలు పెట్టారు. ప్రసాద్‌ను చూసేందుకు తల్లిదండ్రులు రాగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్