AP: మంత్రి నారా లోకేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియన్ హైకమిషన్ ఆయనకు ఆహ్వాన లేఖ పంపింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రమ్ (ఎస్‌వీపీ)లో భాగస్వామ్యం కావాలని కోరుతూ ఆస్ట్రేలియన్ హైకమిషన్ లేఖ రాసింది. ఏపీలో మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధిని ప్రశంసించింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2001లో ఎస్‌వీపీలో భాగస్వామ్యం అయ్యారని వెల్లడించింది.