ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు సిద్ధం: మంత్రి లోకేశ్ (వీడియో)

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం శాసనమండలిలో వైసీపీ సభ్యుల విమర్శలపై ఆయన మాట్లాడారు. మంత్రిగా అన్ని అంశాలు చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైసీపీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందని, ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత వైసీపీ పాలనలో ఎంత బకాయిలు పెట్టారో అందరికీ తెలుసన్నారు.

సంబంధిత పోస్ట్