అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్ధం?

AP: వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించారు. జీతాలు తీసుకుని కూడా విధులకు రాకపోతే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నప్పుడు, ఎమ్మెల్యేలపై కూడా చర్యలు ఎందుకు తీసుకోకూడదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ మినహా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు. హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవడానికి నిబంధనలను పరిశీలిస్తున్నామని, అవసరమైతే వారి అసెంబ్లీ సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం ఉందని స్పీకర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్