వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు

AP: కృష్ణా జిల్లాలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. కేవలం 500 మందికి, 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ద్విచక్రవాహనాలకు పూర్తిగా నిషేధం విధించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్‌.ఎన్‌. గొల్లపాలెం ప్రాంతాల్లో మాత్రమే పర్యటన జరపాలని సూచించారు. కాగా, ఇవాళ జగన్ మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు.

సంబంధిత పోస్ట్