విశాఖ జైలుకు రౌడీషీటర్ శ్రీకాంత్ తరలింపు

AP: తన ప్రేయసి అరుణతో కలిసి దౌర్జన్యాలకు పాల్పడిన రౌడీషీటర్ శ్రీకాంత్‌ను పోలీసులు నెల్లూరు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా అతడిని విశాఖకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాజకీయ నేతల అండతో ప్రియురాలు అరుణతో కలిసి శ్రీకాంత్ జైలులో ఉంటూనే దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. అతడితో సంబంధం ఉన్న రౌడీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్