AP: వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా ఈ పథకానికి అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన్ ఓ ఫామ్‌లో పూర్తి వివరాలు నింపి సెప్టెంబర్ 19 కల్లా సచివాలయాల్లో అందజేయాలి. అర్హులైన డ్రైవర్లను ఎంపిక చేసి అక్టోబర్ 1 నుంచి వారి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది.