AP: హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త తెలిపారు. మహిళలకు ప్రతి నెలా రూ.1500 చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకంను త్వరలో అమలు చేస్తామని ప్రకటించారు. శనివారం నక్కపల్లి మండలంలో జరిగిన స్త్రీశక్తి అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఇప్పటికే పింఛన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని గుర్తుచేశారు.