ఆర్టీసీ, స్కూల్ బస్సు ఢీ.. విద్యార్థులకు గాయాలు

విజయనగరం జిల్లా డెంకాడ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు, ప్రైవేటు స్కూల్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సు డ్రైవర్, మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో విజయనగరం వస్తున్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి రోడ్డుమీద చిన్నారులను చూసి ఆగిపోయారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్