స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం (వీడియో)

AP: విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంకి సమీపంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుని ఒరిగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉండగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులు సేఫ్‌గా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్