క‌ల్తీ మద్యం త‌యారీ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సెల్ఫీ వీడియో

AP: ఎన్టీఆర్ జిల్లా ములకలచెరువు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసుపై తన పేరును అనవసరంగా లాగుతున్నారని ప్రధాన నిందితుడు జనార్దన్ రావు తెలిపారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి తంబళ్లపల్లె టీడీపీ నాయకులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్దోషులను కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. అనారోగ్య కారణాలతో విదేశాల్లో ఉన్నానని, అధికారులకు పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్