తీవ్ర అల్పపీడనం.. భారీ వర్ష సూచన

AP: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీని వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, ప.గో, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్