AP: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. మహిళ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ వేధింపులకు గురి చేసిన వ్యక్తిని బాధితురాలి కుటుంబ సభ్యులు పట్టుకుని స్తంభానికి కట్టేశారు. అతడిని చితక్కొట్టారు. అనంతరం కదిరి గ్రామీణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.