ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల మతి తప్పి మాట్లాడటం మానుకోవాలని ఆమె హితవు పలికారు. GST 2.0 అనేది 'గబ్బర్ సింగ్ ట్యాక్స్' కాదని, అది 'గ్రేట్ సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్' అని యామిని శర్మ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు బుధవారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో యామిని శర్మ మీడియాతో మాట్లాడుతూ చేశారు.