రుగ్మ‌త‌ల‌ను తొల‌గించేందుకు వేదిక‌గా షార్ట్ ఫిల్మ్స్‌: మంత్రి నిమ్మ‌ల‌

సామాజంలో రుగ్మ‌తల‌ను తొల‌గించేందుకు షార్ట్ ఫిల్మ్స్‌ వేదిక‌గా నిలుస్తున్నాయ‌ని మంత్రి నిమ్మ‌ల రామానాయుడు పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచేందుకు ఇవి దోహ‌ద‌ప‌డుతున్నాయ‌న్నారు. పౌరుల‌కు సామాజిక బాధ్య‌త‌ను గుర్తుచేయ‌డంతో పాటు వినోదాన్ని పంచుతున్నాయ‌ని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు వ‌చ్చాక షార్ట్ ఫిల్మ్స్‌కు ఆద‌ర‌ణ పెరిగింద‌ని, యువ‌త‌లోని సృజ‌నాత్మ‌క‌త‌ను వెలికితీసేందుకు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని మంత్రి నిమ్మ‌ల‌ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్