AP: జనసేన మహిళ నేత వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేస్తుందా అనే అంశంపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. రాయుడు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో, సుధీర్ రెడ్డి తనను ప్రోత్సహించి, చంద్రబాబును హత్య చేయాలని చెప్పారని ఆరోపించాడు. దీంతో టీడీపీ అధిష్ఠానం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.