AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం 'స్త్రీ శక్తి' అమలుపై రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈ మేరకు శనివారం తోటి మహిళలతో కలిసి ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను హోంమంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.