AP: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు నివాసాల్లో తనిఖీలు చేసింది. 4 బృందాలతో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో పాటు ఆఫీసు సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డి ఉన్నారు. కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. 71 రోజుల జ్యూడీషియల్ కస్టడీ తర్వాత మిథున్ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు.