పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు తాళ్లలో గణేష్ నిమజ్జన ఊరేగింపు పైకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అల్లూరి జిల్లా పాడేరు చింతలవీధిలో వినాయక నిమజ్జనోత్సవం పైకి స్కార్పియో దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ఘటనపై జగన్ విచారం వ్యక్తం చేశారు.