AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవుల్లో ఆధార్ నవీకరణకు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు ఆర్డీవో, డీఎల్‌డీవోల పర్యవేక్షణలో నూరుశాతం ఆధార్ నమోదు, నవీకరణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెలవుల్లో అయితే చిన్నారులకు ఇబ్బంది లేకుండా సచివాలయాలకు వెళ్లి నవీకరణ చేసుకుంటారని భావిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు.