గుడ్లూరు మండలం, చేవూరులోని రామదూత ఆశ్రమం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణపై సీఎం చంద్రబాబు స్పందించాలని, భూముల స్వాధీనానికి చర్యలు తీసుకోకుండా ఆక్రమణదారులకు సహకరిస్తున్న అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.