వలేటివారిపాలెం మండలంలోని శ్రీ మాలకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం రూ. 12,49,537 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆదివారం తెలిపారు. ప్రత్యేక దర్శనాల ద్వారా రూ. 5,41,700, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 2,85,075, తలనీలాల ద్వారా రూ. 53,075, వివిధ పూజల ద్వారా రూ. 32,190, రూమ్ అద్దెల ద్వారా రూ. 34,490 ఆదాయం సమకూరింది. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.