జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులను దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమించింది. 11 మంది సభ్యులతో కూడిన ఈ పాలకమండలిలో బీజేపీ ఆర్టిఐ సెల్ జిల్లా కన్వీనర్ కీలుకుప్ప శ్రీనివాస్ యాదవ్, టిడిపి నాయకురాలు జొన్నలగడ్డ వరలక్ష్మి నియమితులయ్యారు. ఈ నియామకంపై కూటమి నాయకులతోపాటు పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.